English   

చుల్‌బుల్ పాండే వచ్చే టైం చెప్పేశారు

dabang3
2019-04-28 10:12:17

సల్మాన్‌ఖాన్, సోనాక్షి సిన్హా కాంబినేషన్‌ లో వచ్చిన దబాంగ్ సినిమా ఆరోజుల్లో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఆ ఊపుతో ఈ సినిమా పలు బాషలలోకి రిమేక్ అయ్యి అక్కడ కూడా సంచలన విజయాలను నమోదు చేసింది. దీంతో దీనికి సీక్వెల్ గా తెర‌కెక్కిన ద‌బాంగ్ 2 కూడా భారీ విజ‌యం సాధించింది. ఈ క్రమంలో ప్ర‌భుదేవా ద‌ర్శ‌క‌త్వంలో ద‌బాంగ్ 3 తెర‌కెక్కుతుంది. చుల్‌బుల్ పాండే పాత్ర‌లో న‌టిస్తున్న స‌ల్మాన్ స‌ర‌స‌న‌ ఈ మూడో భాగంలో కూడా సోనాక్షి సిన్హా క‌థానాయిక‌గా న‌టిస్తుంది. సల్మాన్‌ ఖాన్‌ ఫిల్మ్స్‌, అర్బాజ్‌ ఖాన్‌ ప్రొడక్షన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్ ఈ సినిమా డిసెంబ‌ర్ 20న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్టు మేక‌ర్స్ ప్రకటించారు. వాంటెడ్ సినిమా తర్వాత సల్మాన్, ప్రభుదేవా కాంబోలో వస్తున్న ఈ సినిమా మీద భారీగానే అంచనాలు ఉన్నాయి.  ఇక ఈ సినిమాలో ఈగ ఫేం సుదీప్ ఈ చిత్రంలో విల‌న్‌గా న‌టిస్తున్నాడు. దీంతో మొదటి రెండు భాగాల కంటే ఈ భాగం మీద జనాలు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. నిజానికి డిసెంబర్ అంటే చాలా రోజులు ఉన్నప్పటికీ ఆ మాత్రం సమయం అవసరం అని సినిమా యూనిట్ చెబుతోంది.

 

More Related Stories