English   

మహర్షికి రన్ టైం కష్టాలు

maharshi
2019-04-28 10:36:52

ద‌ర్శ‌కుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు పూజాహెగ్డే జంట‌గా న‌టిస్తున్నసినిమా మహర్షి. ఈ సినిమా విడుదలకి సిద్దమవుతోంది. మే9 న ఈ సినిమా రిలీజ్ డేట్ లాక్ చేశారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికర విషయం మీద ప్రచారం జరుగుతోంది అదేంటంటే ఈ సినిమా రన్ టైం గురించి. సినిమా పూర్తయ్యాక కంప్లీట్ ఎడిటెడ్ వెర్ష‌న్ చూడ‌గా మూడున్న‌ర గంట‌లొచ్చిందిట‌. దీంతో లెంగ్త్ బాగా ఎక్కువ అవ్వ‌డంతో చాలా చోట్ల కట్ లు పెట్టీ పెట్టీ 2 గంట‌ల 55 నిమిషాల‌కు కుదించి ఆ సమయాన్ని లాక్ చేసారని సినిమా యూనిట్ నుండి లీకైన సమాచారం. నిజానికి ఇటీవ‌ల కాలంలో రిలీజ్ అవుతోన్న సినిమాల ర‌న్ టైమ్ ఇలానే పెరిగిపోతోంది. దీంతో కొన్ని సీన్స్ సినిమాలో కీల‌క‌మైనా త‌ప్ప‌క వాటికి క‌త్తెర వేయాల్సి వ‌స్తోంది. వాటిని కూడా తర్వాత డిలీటెడ్ సీన్స్ అంటూ యూ ట్యూబ్ లో రిలీజ్ చేసి ప్రమోట్ చేస్తున్నారు అది వేరే విషయం అనుకోండి. ఈ సినిమాకి సంబందించి ఇప్పటివరకు నాలుగు పాటలను విడుదల చేశారు. మరో పాత రేపు రిలీజ్ కానుంది, ఇక ప్రీరిలీజ్ ఫంక్షన్ మే 1న జరగనుండడంతో ఆరోజునే ట్రైలర్ రిలీజ్ చేసి మే 2 నుండి అన్ని థియేటర్లలో ట్రైలర్ ని ప్రదర్శించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

 

More Related Stories