English   

ఎన్జీకే ట్రైలర్ వస్తోంది

ngk
2019-04-28 12:14:52

కోలీవుడ్‌ స్టార్‌ హీరో సూర్య నటిస్తోన్న తాజా సినిమా ఎన్జీకే . సెల్వరాఘవన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రిలీజ్ కి సిద్దమయ్యింది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్‌ కు అద్భుతమైన స్పందన వస్తోంది. ఎన్‌జీకే ను ముందుగా తమిళ నూతన సంవత్సరాది సందర్భంగా ఏప్రిల్‌ రెండో వారంలో విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. అయితే ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో ఆలస్యం కారణంగా  వాయిదా పడింది. మే 31వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. దీంతో సినిమా ప్రమోషన్స్ ని కూడా గట్టిగా చేస్తున్నారు. ఈ సినిమా నుండి ఆడియో అలాగే ట్రైలర్ నీ రేపు విడుదల చేయనున్నట్టు యూనిట్ ప్రకటించింది. సాయిపల్లవి, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకి యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్నాడు. సూర్యకు ఈ సినిమా 36వ సినిమా కాగా ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నారు.

More Related Stories