English   

కార్తీ కొత్త సినిమా షూట్ ప్రారంభం

karthi
2019-04-28 12:28:29

కొద్దిరోజులుగా నటుడు సూర్య తమ్ముడు కార్తీ సూర్య భార్య జ్యోతిక కలిసి సినిమాలో నటించనున్న ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీని మీద ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. ఈ సినిమాలో వీరిద్దరూ అక్క తమ్ముళ్ల గా నటిస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే నిజంగా అక్క తమ్ము ళ్లుగా  నటిస్తున్నారో లేదో తెలియదు కానీ, ఈ సినిమా ప్రారంభం అయినట్టు చిత్ర యూనిట్ ఒక ప్రకటన విడుదల చేసింది. కార్తీ ముఖం దాని మీద అడవులు నేపథ్యంలో ఉన్నట్టు ఈ పోస్టర్ రిలీజ్ చేశారు. మలయాళం దృశ్యం దర్శకుడు జీతు జోసెఫ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఆ దృశ్యం  సినిమా లానే ఇది కూడా క్రైం థ్రిల్లర్ లానే ఉంటుందని, అడవుల నేపథ్యంలో ఆ క్రైం సీక్వెన్స్ లు సాగుతాయని అంటున్నారు. నిజానికి ఖాకీ సినిమా తర్వాత కార్తీ చేసిన దేవ్ బోల్తా పడింది. దీంతో మనోడు ఇప్పుడు నటిస్తున్న ఖైదీ మీదే ఆశలు పెట్టుకున్నాడు. ఆ సినిమా టాకీ పూర్తి కావడంతో ఇంకా పెరు పెట్టని ఈ సినిమా షూట్ లో పాల్గొంటున్నారు. అయితే ఈ సినిమాని జ్యోతిక తమ్ముడు సూరజ్ నిర్మిస్తుండగా, కట్టప్ప సత్యరాజ్ కీలక రోల్ లో నటిస్తున్నాడు. అయితే అందుతున్న సమచారం ప్రకారం ఈ సినిమా షూట్ అంతా సింగిల్ షెడ్యూల్ లాన్ ప్లాన్ చేశారట మేకర్స్. చూడాలి మరి ఈ సినిమా అయినా కార్తీకి హిట్ తెచ్చిపెడుతుందేమో.

 

More Related Stories