English   

నితిన్ మెసేజ్ ఓరిఎంటెడ్ సినిమా...కానీ ఆ కలరింగ్

nithin
2019-04-28 12:56:36

శ్రీనివాస కల్యాణం సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న హీరో నితిన్ వరుసగా సినిమాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ద‌ర్శ‌కుడు చంద్రశేఖర్ యేలేటితో ఒక సినిమా, వెంకీ కుడుమల దర్శకత్వంలో ఒక సినిమా, కృష్ణ చైతన్య దర్శకత్వంలో మరో సినిమా ప్రకటించాడు. అయితే ఆయన చంద్ర శేఖర్ యేలేటితో చేయనున్న సినిమా యూత్ కి కనెక్ట్ అయ్యే కథాంశంతో ఉండనుందని అంటున్నారు. యూత్ కి మెసేజ్ ఇస్తున్నట్టు అర్ధం కాకుండానే కామెడీతోనే అంతర్లీనంగా అవయవదానం ప్రాధాన్యతను తెలిపే విధంగా సందేశం ఉంటుందట. అంటే నితిన్ మార్క్ కామెడీ ఎక్కడా తగ్గకుండానే, మెసేజ్ ని చొప్పించేలా ఆయన ఈ కథను రాసుకున్నాడట. ఇక ఈ సినిమా తరువాత కృష్ణచైతన్య దర్శకత్వంలో నితిన్ చేయనున్న సినిమాకి ‘పవర్ పేట’ అనే టైటిల్ ను ఖరారు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఇక ప్రస్తుతం అయితే భీష్మ ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా వున్నాడు నితిన్‌. వెంకీ కుడుముల దర్శకత్వంలో రష్మిక హీరోయిన్ గా ఈ సినిమా రూపొందనుంది. కొత్త కధాంశంతో నిర్మితం కానున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకి వెళ్లనుంది.

More Related Stories