English   

వర్మ అరెస్ట్ తప్పదా

ramgopal
2019-04-28 17:41:29

వివాదాల దర్శకుడు వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ వివాదం అయిపోయిందనుకున్నారు అంతా. కానీ మళ్ళీ ఆయన ఆ వివాదాన్ని రాజేస్తున్నారు. వ‌ర్మ తెర‌కెక్కించిన ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో త‌ప్ప మిగ‌తా అంత‌టా మార్చి 29న విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఏపీలో ఎన్నికల నేపథ్యంలో సెన్సార్ బోర్డు చిత్ర విడుదలను నిలిపేసింది. అయితే ఎట్టకేలకు అన్ని చిక్కులను దాటి మే 1న ఏపీలో విడుదలవుతుంది. ఈ సంద‌ర్భంగా ఆదివారం రోజున విజ‌యవాడ నోవోటెల్ హోట‌ల్‌లో ప్రెస్‌మీట్ నిర్వ‌హిస్తున్న‌ట్టు వ‌ర్మ త‌న ట్విట్ట‌ర్ ద్వారా పేర్కొన్నాడు. అయితే ఆ హోటల్ వారు వర్మ ప్రెస్ మీట్ ని అనివార్య కారణాల వలన క్యాన్సిల్ చేశారట. దీంతో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాని గతంలో విడుదల కాకుండా అడ్డుకున్న వాళ్ళే ఈ సినిమా ప్రమోషన్స్‌ని కూడా అడ్డుకుంటున్నారంటూ వర్మ తనదైన శైలిలో ఏపీ ప్రభుత్వం మీద విరచుకుపడుతున్నారు. లక్ష్మీస్ ఎన్టిఆర్ సినిమా ప్రెస్ మీట్ విజయవాడ నోవాటెల్ హోటల్‌లో నిర్ణయించాం కానీ ఆ హోటల్ వాళ్లు ఎవరో వార్నింగ్ ఇవ్వటం మూలాన భయంతో క్యాన్సిల్ చేసేశారు. ఈ విపరీత పరిస్థితుల్లో ట్రై చేసినా అన్ని హోటల్స్, క్లబ్బుల, మేనేజిమెంట్లు, మనందరికీ తెలిసిన ఒక వ్యక్తి భయంతో జడిసి పారిపోయారు’ అంటూ ‘కుట్రల వెనుకు కుట్రలు’ అనే పోస్టర్‌ను రిలీజ్ చేశారు వర్మ. మరో ట్వీట్‌లో నేను పైపుల రోడ్డులో ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర నడి రోడ్డు మీద ఈరోజు 4 గంటలకు ప్రెస్ మీట్ పెడుతున్నా. మీడియా మిత్రులకి, ఎన్ టి ఆర్ నిజమైన అభిమానులకి, నేనంటే అంతో ఇంతో ఇష్టమున్న ప్రతీవారికీ నిజాన్ని గౌరవించే ప్రజలందరికీ మీటింగ్‌లో పాల్గొన్నటానికి ఇదే నా బహిరంగ ఆహ్వానం’ అంటూ ప్రెస్ మీట్ లొకేషన్‌ను షేర్ చేశారు వర్మ. నిజానికి వర్మ ప్రకటించినట్టుగా నడిరోడ్డుపై ప్రెస్ మీట్ పెడితే పోలీసులు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే రోడ్డు మీద జన జీవనానికి ఇబ్బంది కలిగిస్తున్నారు అనే సాకుతో అరెస్ట్ చేస్తారు. దీనిని కూడా ఆయన మరింత ప్రమోట్ చేసుకునే అవకాశం ఉంది. 

More Related Stories