English   

వర్మ అరెస్ట్...బలవంతంగా హైదరాబాద్ కి

ramgopal1
2019-04-28 17:51:46

విజయవాడలో నడిరోడ్డు మీద 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా గురించి ప్రెస్ మీట్ నిర్వహిస్తానని దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. దాని కోసం ఆయన నిర్మాత రాకేష్ రెడ్డితో కలిసి గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. ఎయిర్ పోర్టు నుంచి బయటకు వచ్చి  రామవరప్పడు రింగ్ మీదగా ప్రకాష్ నగర్ వెళ్ళి ప్రెస్ మీట ఏర్పాట్లు చేస్తుండగా పోలీసులు వర్మను అదుపులోకి తీసుకున్నారు. ప్రెస్ మీట్ కి పర్మిషన్ లేదని తేల్చి చెప్పారు. పోలీసుల తీరుపై వర్మ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అదుపులోకి తీసుకున్న తిరిగి హైదరాబాద్ పంపడానికి గన్నవరం విమానాశ్రయానికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయం మీద వర్మ ట్విట్టర్ లో స్పందిస్తూ ఏపీలో ప్రజాస్వామ్యం లేదని, పోలీసులు తీరు సరికాదని ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. అలాగే నాలుగు గంటల ప్రెస్ మీట్ క్యాన్సిల్ అయిందని, పోలీసులు తనని విజయవాడ వెళ్ళకుండా అడ్డుకుంటున్నారు అని, తనను బలవంతంగా హైదరాబాద్ పంపుతున్నారని పేర్కొన్నారు. చంద్రబాబూ ప్రజాస్వామ్యం ఎక్కడ అంటూ వర్మ ప్రశ్నించారు.

More Related Stories