English   

ప్రముఖ టాలీవుడ్ నటుడు మృతి

bose
2019-04-28 18:10:47

ప్రముఖ సినీ, టీవీ నటుడు సుభాష్ చంద్రబోస్ అలియాస్ బోస్ ఈరోజు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.  నాలుగు రోజుల క్రితం కృష్ణానగర్లోని తన ఇంట్లో ప్రమాదవశాత్తు జారిపడిన బోస్ తలకు తీవ్ర గాయమైందని సమాచారం.  దీంతో ఆయన్ను గాంధీ ఆసుపత్రిలో చేర్చారు. నాలుగు రోజులపాటు మృత్యువుతో పోరాడియాన ఆయన ఈరోజు కన్నుమూశారు. నిన్నే పెళ్లాడుతా, ఇడియట్, శివమణి, అల్లరి రాముడు వంటి సినిమాలతోనే కాకుండా, అనేక టీవీ సీరియళ్లతో ప్రేక్షకులకు ఈయన దగ్గరయ్యాడు. బోస్ మరణంతో సినీ, టీవీ రంగాల్లో విషాదం అలుముకుంది. ఆయనతో అనుబంధం ఉన్న నటీనటులు విచారం వ్యక్తం చేస్తున్నారు. సుభాష్ చంద్రబోస్ దాదాపు మూడు దశాబ్దాలుగా నట ప్రస్థానం కొనసాగిస్తున్నారు. పూరీ, కృష్ణ వంశీ లాంటి దర్శకులు ఆయనను బాగా ప్రోత్శహించారు

More Related Stories