English   

బాలయ్యకి మళ్ళీ విలనిజం చూపిస్తాడా ?

nbk1
2019-04-28 19:04:26

ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా అలరించిన జగపతి బాబు తర్వాతి రోజుల్లో పవర్ఫుల్ విలన్ గా అవతరించాడు. ఒకపక్క హీరోయిన్, హీరోల తండ్రి పాత్రలు చేస్తూనే టాలీవుడ్ లో స్టైలిస్ట్ విలన్ గా మారాడు. నిజానికి లెజెండ్ సినిమాలో విలన్ గా చేయడం అతని కెరీర్ ని ఊహించని మలుపు తిప్పింది. ఆ తర్వాత ఆయన విలన్ గా కొన్ని సినిమాలు వచ్చినా లెజెండ్ ఎప్పటికీ ఆయనకు మెమరబుల్ అంతే. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్యతో జగపతి బాబు మరోసారి విలనిజం చూపించబోతున్నాడు. కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో సి కళ్యాణ్ నిర్మించే మూవీలో బాలయ్యతో డీ కొట్టే పాత్రకు జగపతి బాబునే ఎంచుకున్నట్టు సమాచారం. ఇంకా అఫీషియల్ గా అయితే ప్రకటించలేదు కాని దాదాపు ఓకే అయినట్టు చేబుతున్నరు. ఇదే కనక నిజమైతే మరోసారి పవర్ఫుల్ ఫైట్ ని తెరపై చూడవచ్చు. నిజానికి ఈ ఇద్దరి కాంబినేషన్ బోయపాటి సినిమాతో ఉంటుందని భావించారు ప్రేక్షకులు, అయితే బోయపాటి సినిమా లేట్ కావడం బాలయ్య రవి కుమార్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ క్రేజీ కాంబో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందన్న మాట.

More Related Stories