English   

వర్మకి జగన్ సపోర్ట్ 

ysjagan
2019-04-29 08:42:36

ఆంధ్రప్రదేశ్‌లో 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో విజయవాడలో రోడ్ మీద ప్రెస్‌మీట్‌ పెడతానని బయల్దేరిన వర్మను ఏపీ పోలీసులు అడ్డుకుని, ఏడూ గంటల పాటు నిర్బంధించి మళ్ళీ హైదరాబాద్ కి పంపిన సంగతి తెలిసిందే. ఈ విషయం మీద వర్మ ఒక ప్రశ్నావళి కూడా ఏపీ సీఎం, పోలీసులను ఉద్దేశించి సంధించాడు. అయితే వర్మను పోలీసులు అడ్డుకోవడం దారుణమైన చర్యని వైసిపి అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. వర్మను ఏపీ పోలీసులు విమానాశ్రయంలో అక్రమంగా నిర్బంధించడాన్ని ఖండిస్తూ నిన్న ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. వర్మను ప్రెస్‌మీట్‌ పెట్టకుండా ఎపి ప్రభుత్వం అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని పేర్కొన్న జగన్ పౌరుల హక్కులను కాలరాసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి భద్రతల పేరుతో వర్మ, రాకేశ్‌ రెడ్డిలను బలవంతంగా గన్నవరం విమానాశ్రయానికి తరలించి లాంజ్‌ లో నిర్బంధించడం దారుణమని జగన్ పేర్కోన్నారు. అలాగే ఆయన ఈ విషయం మీద ట్వీట్ కూడా చేశారు, విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టలేని  పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్యం ఉంది.  పోలీసుల్ని బంట్రోతులు కన్నా హీనంగా వాడుకునే పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్యం ఉంది. ఇదా ప్రజాస్వామ్యం..! చంద్రబాబు గారూ..! ఇంతకీ రామ్ గోపాల్ వర్మ చేసిన తప్పేంటి..? అంటూ జగన్ ట్వీట్ చేశారు. 

More Related Stories