English   

నేడు శింబు సోదరుడి రిసెప్షన్  

Hero Simbu brother  Kuralarasan  wedding reception in chennai
2019-04-29 09:04:46

కోలీవుడ్ స్టార్ హీరో శింబు సోదరుడు కురళరసన్ ఓ ఇంటివాడయ్యాడు. బాల నటుడిగా వెండితెరకు పరిచయం అయిన కురళరసన్ ఆ తరువాత సంగీతంపై దృష్టి సారించాడు. శింబు, నయనతార జంటగా నటించిన ఇదునమ్మ ఆళు సినిమాతో సంగీతదర్శకుడిగా పరిచయం అయ్యాడు. కురళరసన్‌ ఒక ముస్లిం యువతిని ప్రేమించడం, వివాహానికి తల్లిదండ్రులు పచ్చజెండా ఊపడంతో ఆయన ఈ మధ్యే ఇటీవల ఇస్లాం మతాన్ని స్వీకరించాడు. చెన్నై అన్నాశాలైలో 26 వ తేదీన మసీదులో కురళరసన్ తన ప్రేమించిన నబీలా అహ్మద్ ను ఇస్లాం మత సంప్రదాయ ప్రకారం పెళ్లి చేసుకున్నాడు. ఈ వివాహం చాలా నిరాడంబరంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు మత గురువులు మాత్రమే పాల్గొన్నారు. అయితే సినీ ప్రముఖుల కోసం వివాహ రిసెప్షన్‌ ను టీ.రాజేందర్‌ ఈరోజు చెన్నైలోని ఒక స్టార్‌ హోటల్‌లో ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొననున్నారు.  

More Related Stories