English   

మహర్షి పాలపిట్ట...పనైపోయిందన్నారుగా ?

Maharshi
2019-04-29 11:06:21

సూపర్ స్టార్ మహేష్‌బాబు హీరోగా నటించిన సినిమా మహర్షి. దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోండగా ఈ సినిమాలో అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. . వైజయంతి మూవీస్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, పి.వి.పి సినిమాలు సంయుక్తంగా హై టెక్నికల్ వేల్యూస్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా మహేష్‌కు 25వ సినిమా కావడంతప్ మే 9న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల విడుదైలెన ‘ఛోటి ఛోటి ఛోటి బాతే.. మీటి మీటి మీటి యాదే’, ‘‘నువ్వే సమస్తం.. నువ్వే సిద్ధాంతం….నువ్వే నీపంతం, నువ్వేలే అనంతం’, ‘ఎవరెస్ట్ అంచున పూసిన రోజా పువ్వే ఓ చిరునవ్వే విసిరిందే..’, ‘పదర పదర పదరా.. నీ అడుగుకి పదును పెట్టి పదరా.. ఈ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా..’ పాటలకు జనం నుండి మిశ్రమ స్పందన వస్తోంది.  ఇక సినిమాలోని ఐదో పాట అయిన ‘పాలపిట్ట..’ను ఈ రోజు విడుద‌ల చేసింది చిత్ర యూనిట్. శ్రీ‌మణి రాసిన ఈ గీతాన్ని రాహుల్, మాన‌సి ఆల‌పించారు దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం స‌మ‌కూర్చాడు. నిజానికి ఇంతకు ముందు వదిలిన పాటలు అంతగా బాలేవు దీంతో దేవీ శ్రీ పనైపోయింది అంటూ కామెంట్స్ వినిపించాయి. అదేమ లేదు నేను ఇంకా లైన్ లోనే ఉన్నాను అంటూ అదిరిపోయే సింగిల్ ఇచ్చారు దేవి శ్రీ.

More Related Stories