English   

డ్రైవర్ మర్డర్...కన్నడ హీరోయిన్ అరెస్ట్ !

Kanada Actress
2019-04-29 14:21:17

కన్నడ సినీ నటి సవితతో పాటు ఆమె తల్లి నాగమ్మను కన్నడ రాష్ట్రానికి చెందిన చెన్నపట్టణ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. సవిత పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నిలదోక్కుకుంటోంది. ఒక కన్నడ సినిమాలో హీరోయిన్ గా నటిచిన ఈమె ఒక తెలుగు సినిమాలో కూడా నటించింది. ఆమె డ్రైవర్ హత్య కేసులో పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం సవిత అత్త కుమారుడయిన సునీల్ కారు డ్రైవర్ గా వ్యవహరిస్తుండేవాడు. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న సునీల్ ను డ్రైవర్ పని నుంచి తొలగించారు సవిత. ఈ నేపథ్యంలో, ఫోన్లు చేస్తూ డబ్బు కోసం తల్లీకూతుళ్లను వేధించేవాడు సునీల్. ఈ క్రమంలో శివరాజు, మను అవే వ్యక్తులు వ్యక్తిగత కక్షలతో సునీల్‌ను చంపడానికి ప్లాన్ చేయగా వీరికి సవిత నాగమ్మ సహాయం చేశారని సునీల్ కదలికలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు వారికి అందించడంతో సునీల్ మరణానికి సహాయం చేశారని పోలీసులు తేల్చారు. అందుకే తల్లీ కూతుళ్ళను అరెస్ట్ చేశారు.

More Related Stories