English   

సినిమాల్లో అవకాశం అంటూ మోసం...హత్య 

Young Girl
2019-04-29 14:33:57

సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి ఒక యువతితో పరిచయం పెంచుకున్న యువకుడు ఆమె త్వరగా అవకాశాలు ఇప్పించమని తొందర పెట్టడంతో ఆమెను అంతమొందించిన ఘటన ఏపీలోని పాలకొల్లు దగ్గరలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం భీమవరం మండలం కే బేతపూడికి చెందిన మహిత తల్లి గల్ఫ్ లో ఉంటుంది. తండ్రి భీమవరం ఆదీత్య కాలేజ్ బస్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అయితే ఇంటర్ పూర్తి చేసిన మహిత కాజ గ్రామంలో తన మేనమాన గెడ్డం రవి ఇంట్లో ఉంటోంది. హైదరాబాద్ లో ఉంటున్న కురెళ్ల మహేశ్ అనే యువకుడు సినీ పరిశ్రమలో పని చేస్తున్ననంటూ మహితకి పరిచయం అయ్యాడు. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పడంతో మహిత అతనికి మరింత దగ్గరైంది. అయితే, ఎంతకీ సినిమా అవకాశం రాకపోవడంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు పెరిగాయి. దీంతో ఆమెను హతమార్చాలని ప్లాన్ వేసిన మహేశ్, తన ఇద్దరు స్నేహితులతో కలిసి కాజ గ్రామానికి వచ్చాడు. మాట్లాడాలని పిలిచి ఆమెపై దాడిచేసి కత్తితో మెడపై నరికాడు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ ఘటన చూసిన స్థానికులు వెంబడించగా ముగ్గురిలో ప్రధాన నిందితుడైన మహేశ్ పట్టుబడగా, మిగతా ఇద్దరూ పరారయ్యారు. స్థానికుల దాడిలో తీవ్ర గాయాలపాలైన నిందితుడిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు, కేసును రిజిస్టర్ చేశారు.
 

More Related Stories