English   

భయపడేది లేదు...వర్మ ప్రెస్ మీట్ 

Ram Gopal Varma
2019-04-29 16:44:15

ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో పోలీసులు తమను నిర్బంధించిన విషయం మీద వర్మ, లక్ష్మీస్ ఎన్టీఆర్ నిర్మాత రాకేశ్ రెడ్డి ఈరోజు హైదరాబాద్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. నిన్న జరిగిన విషయం మీద ఇద్దరూ ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదులు, మాఫియా ముఠాలతో ప్రవర్తించిన తరహాలో ఏపీ పోలీసులు తమ పట్ల వ్యవహరించారని, తమ కుళ్లు, కుతంత్రాలు బయటపడతాయన్న భయంతోనే కొందరు నేతలు తమను అడ్డుకుంటున్నారని చెప్పారు. నా సినిమా విడుదల వివరాలు చెప్పుకునేందుకు నిన్న విజయవాడలో ప్రెస్‌మీట్‌ పెడితే పోలీసులకు అభ్యంతరం ఏమిటో అర్థం కాలేదని అన్నారు. ప్రెస్‌మీట్‌ కోసం నేను విజయవాడ వెళితే నన్ను అరెస్టు చేసి నగరం విడిచి పెట్టి వెళ్లాలని కోరారని, కానీ ఎందుకంటే మాత్రం సమాధానం చెప్పడం లేదని నిన్న పోలీసులు బెదిరించడం చూస్తుంటే మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా? అని అనిపించిందని, విజయవాడ ఏమైనా వేరే దేశమా? అని వర్మ ప్రశ్నించారు. జగన్‌ మీద దాడి జరిగితే పోలీసులు కనీసం ఎయిర్‌ పోర్టుకు రాలేదని, కానీ నన్ను మాత్రం ఎయిర్‌ పోర్టులోనే అరెస్టు చేశారని ఆయన  ఆరోపించారు. నిర్మాత రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ఇది ముమ్మాటికీ ఏపీ ప్రభుత్వం కుట్రలో భాగమేనని, మేము దేనికీ భయపడే ప్రసక్తే లేదని తెలిపారు.

More Related Stories