English   

ఆర్ ఆర్ ఆర్ లో నిత్యమీనన్...ఆ రోల్ కోసమేనా ?

Nithya Menen
2019-04-29 18:30:49

రాజమౌళి దర్శకత్వంలో చరణ్, ఎన్టీఆర్ ల కాంబినేషన్ లో ఆర్ఆర్ఆర్ అనే క్రేజీ ప్రాజెక్ట్ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం ఎన్టీఆర్, చరణ్ లకు గాయాలు కావడంతో ఈ సినిమా షూటింగుకి బ్రేక్ ఇచ్చారు. ప్రస్తుతం  వీరిద్దారూ విశ్రాంతి తీసుకుంటున్నారు. మరో పది రోజుల్లో ఈ సినిమా షూటింగు మొదలు కానుంది. చరణ్ జోడీగా అలియా భట్ ను ఫైనల్ చేసిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ సరసన బ్రిటీష్ భామను అనుకున్నా ఏమైందో ఏమో కానీ ఆమె చేతులు ఎత్తేసింది. ఈ క్రమంలో ఎన్టీఆర్ కోసం నిత్యామీనన్ తీసుకున్నారనే టాక్ బలంగా వినిపించింది. అయితే నిత్యను పిలిచి స్క్రీన్ టెస్ట్ కూడా చేయడం దీనికి మరింత ఊతం ఇచ్చింది, కానీ బ్రిటీష్ భామగా ఈమెను ఎలా తీసుకుంటారు అనే అనుమానం అందరిలోనూ నెలకొని ఉండగా ఆమెను హీరోయిన్ పాత్ర కోసం తీసుకోవట్లేదు అని తెలిసింది. దీంతో  సినిమాలో ఆమె పోషించనున్న పాత్ర ఏమిటనే విషయం ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రను ప్రేమించే గిరిజన యువతిగా నిత్యామీనన్ కనిపిస్తుందనేది తాజా సమాచారం. అంటే ఎన్టీఆర్ కి రెండో హీరోయిన్ గా ఆమె గిరిజన యువతిగా ఇందులో కనిపిస్తుందట. దీని మీద అధికారిక ప్రకటన వెలువడితే కానీ క్లారిటీ రాదు.

More Related Stories