English   

నాగార్జున తో రొమాన్స్ చేయనున్న కన్నడ బ్యూటీ ?

Akshara Gowda
2019-04-29 18:46:11

నాగార్జున రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం మన్మధుడు 2. గతంలో నాగార్జున హీరోగా విజయ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన మన్మధుడు సినిమాకు ఇది సీక్వెల్. మన్మదుడులో నాగార్జున సరసన సోనాలి బింద్రే, అన్షు హీరోయిన్లుగా నటించగా సీక్వెల్ లో ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది, ఇక మరో హీరోయిన్ గా కన్నడ భామ అక్షర గౌడ నాగార్జున సరసన నటించనుందని టాక్. ప్రస్తుతం కన్నడ,తమిళ్ సినిమాల్లో బిజీగా వున్న ఈ భామ మ‌న్మ‌థుడు2 లో సెకండ్ ఫీమేల్ లీడ్ గా నటిస్తుందని, ఈ సినిమాతో గ్రాండ్ డెబ్యూకి రెడీ అవుతుందని ఆమె వెల్లడించింది. అక్షర గౌడ ఈ సినిమాలో చేసేది జస్ట్ అతిధి పాత్రలోనే నట. సినిమాలోని ఓ సందర్భంలో జస్ట్ అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుందంతే. ఈ విషయాన్ని కూడా తనే సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చింది. ఇప్పటికే తమిళ, కన్నడ సినిమాలు కలిపి 6 కు పైగా సినిమాల్లో నటించిన అక్షర గౌడ తమిళంలో మంచి క్రేజ్ సంపాదించింది. ఈ సినిమాతో తెలుగులో పాగా వేయాలని భావిస్తోంది ఈ భామ.  

More Related Stories