English   

నయన్ పెళ్ళికి రెడీ అవుతోందా

nayantara
2019-04-29 19:44:53

లేడీ సూపెర్ స్టార్ నయనతార- విఘ్నేష్ జంట తొందర‌లోనే పెళ్లికి రెడీ అవుతున్నారనన్న ప్రచారం కోలీవుడ్ మీడియాలో జోరుగా సాగుతోంది. వీరు దాదాపు మూడేళ్ల నుండి ప్రేమలో ఉన్నారు, పెళ్లి మ్యాటర్ మీద అయితే ఇద్దరిలో ఎవరూ ఎప్పుడూ క్లారిటీ ఇచ్చిందే లేదు. అయితే తాము ప్రేమలో ఉన్నామని ఎన్నోసార్లు ప్రూఫ్ లు ఇచ్చారు. కోలీవుడ్ లో ఏ ఈవెంట్ కి వెళ్లినా ఇద్దరు కలిసే వెళ్లడం, సోషల్ మీడియా లో వీరిద్దరు కలిసి దిగిన ఫొటోస్ పెట్టడం లాంటివి చేసి తమ ఫ్యాన్స్ కి బాగా దగ్గరగా ఉన్నారు. అయితే వీరు మీడియా ముందు ఎప్పుడు కనిపించినా మీ పెళ్లి ఎప్పుడు అని అడిగితే మాత్రం మొహం చాటేసుకుని వెళ్లిపోయేవారు. అయితే తాజాగా కోలీవుడ్ సమాచారం ప్రకారం ఈ జంట తమ పెళ్లిపై ఓ అవగాహనకు వచ్చిందట. ఈ ఏడాదిలోనే ఎంగేజ్ మెంట్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. నిశ్చితార్థం అనంతరం ఇప్పటికే చేసుకున్న ఓ అరడజను కమిట్ మెంట్లను పూర్తి చేసుకుని నయన్ తీరిగ్గా పెళ్లాడాలనుకుంటున్నారట. ఇకపోతే సౌత్ విషయానికి వస్తే పెళ్లి తర్వాత హీరోయిన్స్‌కు అవకాశాలు దక్కడం అన్నది కాస్తంత కష్టమే. అందుకే ఈ ఎంగేజ్మెంట్ టెక్నిక్ అన్నమాట.

More Related Stories