English   

ఎన్జీకే ట్రైలర్ టాక్

ngk
2019-04-29 21:43:26

తమిళ్ స్టార్ డైరెక్టర్ సెల్వ రాఘవన్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ఎన్జీకే. సూర్య సరసన సాయిపల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు. సూర్య రాజకీయాల్లోకి ప్రవేశించడంతో స్టార్ట్ అయిన ట్రైలర్ లో చాలా ట్విస్టులిచ్చాడు డైరెక్టర్ దేశ భవిష్యత్తు మారాలంటే యువత రాజకీయాల్లోకి రావాలని పెర్కొనేలా ట్రైలర్ కట్ చేశారు. ఒక చిన్న గుంపును వేసుకొని రాజకీయాల్లోకి వచ్చేస్తే నిన్ను రానిస్తారు అనుకున్నావా? అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. బొమ్మలు గీసేవాడు వాడి కొడుక్కి బొమ్మలు గియ్యడం నేర్పిస్తే, మా నాన్న మిలట్రీరా, గోలీలాడుకోడం నేర్పిస్తాడా రక్తం చిందించి ధాన్యం పండించే ఒక్కో రైతుకి, ఈ దేశం బాగుండాలని కష్టపడే ఒక్కో కార్మికుడికి దేన్నైనా నిలదీసి అడిగే హక్కుంది అంటూ సూర్య చెప్పిన డైలాగ్స్ పేలాయి. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ సినిమాని  డ్రీవ్ వారియర్స్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమాను మే 31 ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

More Related Stories