English   

మహేష్ - మురగదాస్ లతో కలిసి హాలీవుడ్ సినిమా చేయాలనుందట

maheshbabu
2019-04-29 22:07:30

హాలీవుడ్‌ స్టార్‌ బిల్‌ డ్యూక్‌ టాలీవుడ్‌ స్టార్ మహేశ్‌బాబు, డైరెక్టర్ వంశీ పైడిపల్లి, తమిళ దర్శకుడు ఎ.ఆర్‌. మురుగదాస్‌లను ఉద్దేశించి ట్వీట్‌ చేశారు. అన్నీ కుదిరితే ఓ అంతర్జాతీయ స్పై సినిమా తీద్దామంటూ వారిని లంచ్‌కు ఆహ్వానించడం టాలీవుడ్ , కోలీవుడ్ లలో చర్చనీయాంశంగా మారింది. మహేశ్ బాబు, వంశీ పైడిపల్లి, ఏఆర్ మురగదాస్ లను ఉద్దేశించి ట్వీట్ చేసిన బిల్ డ్యూక్, లాస్ ఏంజెల్స్ వస్తే తనను కలవాలని సూచించారు. వీలైతే ఓ ఇంటర్నేషనల్ స్పై మూవీ తీద్దామంటూ ఆఫర్ చేశారు. 'లాస్ ఏంజెల్స్ వస్తే డౌన్ టౌన్ లో కలుద్దాం, డిన్నర్ చేస్తూ స్పై మూవీ గురించి చర్చిద్దాం' అంటూ తన ట్వీట్ లో పేర్కొన్నారు. అంతేకాదు మహిళల అక్షరాస్యత అభివృద్ధి విషయంలో అంతర్జాతీయ కార్యక్రమాల ఏర్పాటు గురించి చర్చిద్దామని ఐశ్వర్య ధనుష్‌కు బిల్‌ చెప్పారు. ఐశ్వర్యను 2016లో యునైటెడ్ నేషన్స్ ఉమెన్స్ గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా ఎంపిక చేసింది.  ఇక మరోపక్క హాలీవుడ్‌ స్టార్‌ మహేశ్‌ను ఆహ్వానించడంతో అభిమానులు సంబరపడుతున్నారు

 

More Related Stories