English   

రానా సినిమాతో రీ ఎంట్రీ

rana
2019-04-30 08:19:18

టాలీవుడ్‌ లో ఫేడవుట్ అయిన హీరోయిన్స్ అందరూ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు. తాజాగా యమదొంగ, పెళ్ళైన కొత్తలో లాంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించి ఫేడవుట్ అయిన ప్రియమణి సినిమా అవకాశాలు తగ్గడంతో పెళ్లి చేసుకుంది. కొన్ని టీవీ షోలలో జడ్జ్ గా కాలం వెళ్ళదీస్తున్న ఈమెకి అదిరిపోయే సినిమా ఆఫర్ వచ్చిందని చెబుతున్నారు. ఆమె త్వరలో రానా నటించబోయే విరాటపర్వం 1992 అనే సినిమా ద్వారా వెండితెరపై రీ ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తుంది. నీదీ నాదీ ఒకే కథ ఫేమ్ వేణు ఊడుగుల డైరెక్ట్ చెయ్యనున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తుండగా, నటి టబు ఒక కీలక పాత్రలో నటిస్తోంది.  ఎమర్జెన్సీ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో టబు మానవ హక్కుల కోసం పోరాటం చేసే మహిళ పాత్రని పోషిస్తున్నట్టు సమాచారం. సాయి పల్లవి నక్సలైట్‌గా కనిపించనున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో స్టార్ట్ కానుంది. మొత్తానికి ఈ సినిమా క్యాస్టింగ్ తోనే సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నారు మేకర్స్.

More Related Stories