English   

మెగాస్టార్ సినిమా ముహూర్తం కుదిరిందా

chiru
2019-04-30 08:43:58

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో సైరా నరసింహ రెడ్డి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మరో నెలలో ఈ సినిమా షూటింగ్ పూర్తి అయి దసరా రిలీజ్ కోసం రెడీ అవుతోంది. ఇక ఈ సినిమా పూర్తికాగానే కొరటాల శివ డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నాడనే సంగతి తెలిసిందే. సినీ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేసిన కొరటాల ఈ సినిమాను ఆగస్టులో మొదలుపెట్టనున్నట్టు స‌మాచారం. ఓ మంచి సోషల్ మెసేజ్ తో ఉన్న స్క్రిప్ట్ తో పెద్ద గ్యాప్ లేకుండానే షూటింగును మొదలుపెడతారట‌. హీరోయిన్స్ గా తమన్నా, శ్రుతిహాసన్ పేర్లు వినిపిస్తున్నాయిగానీ, ఇంకా ఎవరి పేరును ఫైనల్ చేయలేదు. అంతే కాక సునీల్, అనసూయ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారని అంటున్నారు. ఈ చిత్రం కూడా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో తెరకెక్కుతోందనే వార్తలు వస్తున్నాయి. అయితే ముందు బోయపాటితో సినిమా ఉంటుందని భావించినా బోయపాటి ఇచ్చిన వినయవిధేయరామ దెబ్బతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్టు సమాచారం.
 

More Related Stories