English   

మళ్ళీ అలరించనున్న జేమ్స్ బాండ్

 Daniel Craig
2019-04-30 10:10:46

ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులకి ఏమాత్రం బోర్ కొట్టించకుండా నడుస్తున్న జేమ్స్ బాండ్ ఫ్రాంచైజ్ నుండి 25వ చిత్రం తెర‌కెక్క‌బోతుంది. ఈ సినిమాలో ఎవరెవరు నటించనున్నారు అనే విషయాన్ని ప్రకటిచింది సినిమా యూనిట్. ఈ టైటిల్ పాత్రలో ఎప్పటిలాగే ప్రముఖ హాలీవుడ్‌ నటుడు డేనియల్‌ క్రెయిగ్‌ నటించనున్నారు. ఈయనతో పాటు గత చిత్రాల్లో నటించిన జెఫ్రీ రైట్‌, బెన్‌ విషా, రాల్ఫ్‌ ఫీన్స్‌, నావోమీ హారిస్‌ కూడా ఉన్నారు. విలన్‌ పాత్రలో ఆస్కార్‌ అవార్డు గ్రహీత, ‘బొహెమియన్‌ రాప్సోడీ’ ఫేం రామీ మలెక్‌ నటించబోతుండడం సినిమాకే హైలైట్. ఈ సినిమాలో రామీ మలెక్‌ పాత్ర విభిన్నంగా, పవర్‌ ఫుల్‌గా ఉండబోతోందని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన అనేక భీకర ఆయుధాలు కలిగి ఉన్న ప్రతినాయకుడి పాత్రలో ఆయన నటించబోతున్నారు. ఈ సినిమాకి కధను నీల్‌ పూర్విస్‌, రాబర్ట్‌ వేడ్‌, స్కాట్‌ బర్న్స్‌, ఫీబీ వాల్లర్‌ అందించనున్నారు. అలాగే ఈ సినిమాకి కేరీ దర్శకత్వం వహించనున్నారు. జమైకా, నార్వే, లండన్‌, ఇటలీ దేశాల్లో ఈ సినిమాని సినిమాను చిత్రీకరించబోతున్నారు. ఈ సినిమాలో అపహరణకు గురైన ఓ శాస్త్రవేత్తను కాపాడేందుకు మళ్లీ బాండ్‌ ను లైన్ లోకి తీసుకొస్తారని, దీని ఆధారంగానే కథ ఉండబోతోందని హాలీవుడ్‌ వర్గాల నుండు అందుతున్న విశ్వసనీయ సమాచారం.

More Related Stories