English   

మా అసోసియేషన్ కీలక నిర్ణయాలు

 MAA
2019-04-30 11:48:14

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ముగిసిన అనంతరం తొలి సమావేశం నిర్వహించిన నరేష్ ప్యానెల్ ఫస్ట్ టైమ్ కీలక తీర్మానాలు చేసింది. ముందుగా మేనిఫెస్టోలో చెప్పినట్లుగా కొన్ని విషయాలను ఈ తీర్మానాల్లో అమలు చేయడానికి ప్యానెల్ ప్రయత్నాలు చేస్తోంది. 2019-21 సంవత్సరములకు గాను కమిటీ ఈ నిర్ణయాలు తీసుకుంది.  మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌లో సభ్వత్వం తీసుకున్న సభ్యులు తమ సమస్యలను తెలిపేందుకు హెల్ప్‌ లైన్‌ నంబర్‌ 9502030405కి సంప్రదించాలని సూచించారు. పింఛనుదారులకు గతంలో అందించే పింఛనుకు అదనంగా వెయ్యి పెంచి 6 వేలను వారి ఖాతాలో జమ చేస్తామని తెలిపారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మా సభ్యులకూ వర్తింపజేసేలా, వాటి మీద అవగాహన పెంచేలా చర్యలు తీసుకోనున్నారు. అలాగే మా అసోసియేషన్‌లో కొత్తగా సభ్యత్వం తీసుకునే వారి కోసం రెండు రకాల పద్ధతులను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. అందుల్ప్ మొదటి పద్ధతి ప్రకారం రూ. 25 వేలు చెల్లించిన నూతన సభ్యునికి గోల్డ్‌కార్డు అందజేస్తారు, దీని కాలపరిమితి రెండేళ్లు ఉంటుంది ఈ రెండేళ్లలో మిగతా రూ.75 వేలు చెల్లించినట్లయితే వారు జీవితకాల సభ్యత్వ కార్డు పొందేలా చర్యలు. ఈ వ్యక్తులు శాశ్వత సభ్యునిగా గుర్తింపు పొందనంత వరకు 'మా' తరఫున ఎలాంటి సౌకర్యాలు వీరికి వర్తించవు. రెండో పద్ధతిలో రూ.90 వేలు చెల్లించిన వారికి రూ.10 వేల రాయితీతో పాటు శాశ్వత సభ్యత్వ కార్డు అందజేస్తామన్నారు. ఈ అవకాశం 100 రోజులు మాత్రమే ఉంటుందట. మా సభ్యులందరికీ గతంలో రూ.2 లక్షల వరకు ఎస్‌బీఐ సంపూర్ణ సురక్షా జీవిత బీమాను వర్తింపజేశారని ప్రస్తుతం దీనికి అదనంగా మరో రూ.లక్ష పెంచి రూ.3 లక్షల బీమాను అందించనున్నట్లు ప్రకటించారు.

More Related Stories