English   

డైరెక్టర్ గా మారిన బోయపాటి అసోసియేట్

Boyapati
2019-04-30 13:10:55

టాలీవుడ్ మాస్ డైర‌క్ట‌ర్ బోయ‌పాటి శ్రీను దగ్గర గత సినిమాలకు అసోసియేట్ గా పని చేసిన స్వ‌రాజ్ నూనె అనే ఆయన ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. తాజాగా ఈ సినిమా ప్రారంభోత్స‌వం నిన్న హైద‌రాబాద్‌లో. కార్తీక్‌ రాజు, వర్ష బొల్లమ్మ జంటగా సంపత్‌ రాజ్‌ కీలక పాత్రలో నటించనున్న ఈ సినిమాని  ఆదిత్య మూవీ మేకర్స్‌ నిర్మాణంలో గురవయ్య యాదవ్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ముహూర్త‌పు షాట్ కి బోయ‌పాటి శ్రీను కెమెరా స్విచ్ఛాన్ చేసి, గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇక మరో దర్శ‌కుడు భీమ‌నేని శ్రీనివాస‌రావు క్లాప్‌ కొట్టారు. ఇక కార్తీక్ రాజుకి హీరోగా ఇది మూడవ సినిమా 2016లో పడేశావే సినిమాతో తెరంగ్రేటం చేసిన ఈ నటుడు విడుదలకి సిద్దమయిన ఆపరేషన్ గోల్డ్ ఫిష్ లో కూడా నటించాడు. ఇక వర్ష బొల్లమ్మ విషయానికి వస్తే కర్నాటకలో కొడగు ప్రాంతానికి చెందిన ఈ భామ మలయాళ నటి నజ్రియా నజీం పోలికలతో ఉంటుంది, ఈమె ఇప్పటికే ఒక తెలుగు సినిమాలో నటిస్తోంది, ఆమెకు తెలుగులో ఇది రెండవ సినిమా.

More Related Stories