English   

వారణాసికి వెళ్తున్న ఇస్మార్ట్ శంకర్ 

 iSmart Shankar
2019-04-30 14:04:10

ఎనర్జిటిక్‌ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం ఇస్మార్ట్ శంకర్. డబుల్ దిమాక్ ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ సినిమాని పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్, ఛార్మిలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరపుకుంటున్న ఈ సినిమాను సమ్మర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ మధ్యనే ఈ సినిమా మూడో షెడ్యూల్ హైదరబాద్ లో పూర్తి అయ్యింది. దీంతో తదుపరి షెడ్యూల్ వారణాసి లో జరుగనుందని నిర్మాత ఛార్మి ప్రకటించింది. రేపటి నుండి ప్రారంభం కానున్న ఈ షెడ్యూల్ లో యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించనున్నారని ఆమె ఒక వీడియో రిలీజ్ చేసింది.ఈ షెడ్యూల్ తో షూటింగ్ దాదాపుగా పూర్తి కానుందట. పునీత్ ఇస్సార్, సత్యదేవ్, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, సుధాంశు పాండే ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా అటు రామ్ కి ఇటు పూరీకి ఇద్దరికీ చాలా ప్రతిష్టాత్మకమైనది. చూడాలి మరి ఏమవుతుందో ?

More Related Stories