English   

అమితాబ్ ఆ పాత్ర ఒప్పుకున్నారా ?

Amitabh
2019-04-30 16:14:13

బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ హిజ్రా పాత్రలో నటించబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది. తమిళ తెలుగు బాషలలో సూపర్ హిట్ అయిన కాంచన సినిమాని హిందీలో మేక్ చేయ‌నున్నాడు లారెన్స్‌. ఈ హారర్ కామెడీ సినిమాలో బాలీవుడ్ న‌టుడు అక్షయ్ కుమార్, కైరా అద్వానిలు జంట‌గా న‌టించ‌నున్నారు. అయితే ఈ సినిమాలో అత్యంత కీలకమైన హిజ్రా పాత్రకు బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ ని సంప్రదించారని ప్రచారం జరుగుతోంది. ఒరిజినల్ కాంచన సినిమాలో హిజ్రా పాత్రలో ప్రముఖ నటుడు శరత్‌కుమార్‌ నటించిన సంగతి తెలిసిందే. ఆయన నటన ఈ సినిమాకే హైలైట్ అయింది. అలాగే తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నో  ప్రయోగాలు చేసిన బిగ్ బి ఇప్పటివరకూ హిజ్రా పాత్రలో మాత్రం నటించలేదు. అందుకే ఈ రోల్ ని ఒప్పుకుంటారని అంటున్నారు. ఈ పాత్రలో బిగ్ బి నటిస్తే ఈ సినిమాకి క్రేజు మరింత పెరిగినట్టే. అయితే ఈ విషయం మీద ప్రకటన వెలువడితే కానీ ఏమీ చెప్పలేని పరిస్థితి. ఇక ఈ సినిమాలో మాధవన్‌, శోభితా ధూలిపాళలు కూడా కీలక పాత్రలు పోషించనున్నారు.  ఈ సినిమా పూర్తయ్యాక లారెన్స్ కాంచన 4 కూడా ప్లాన్ చేశాడు.

More Related Stories