English   

ఇక్కడ డిజాస్టర్....అక్కడ బ్లాక్ బస్టర్ 

 kavacham
2019-04-30 18:02:09

గతేడాది డిసెంబర్ లో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా కాజల్ అగర్వాల్, మెహరీన్ లీడ్ రోల్స్ లో  వచ్చిన సినిమా కవచం. శ్రీనివాస్ మామిళ్ల అనే నూత దర్శకుడి దర్శకత్వంలో ఈ సినిమా  వచ్చినట్టే చాలా మందకి తెలీదు. అంత పెద్ద బ్లాక్ బస్టర్ డిజాస్టర్ అన్నమాట. అయితే ఇక్కడ బ్లాక్ బస్టర్ అయితేనేమి ఈ సినిమాను హిందీలోకి డబ్ చేసి  ‘ఇన్‌స్పెక్టర్ విజయ్’ పేరుతో యూట్యూబ్ ‌లో రిలీజ్ చేసారు. యూట్యూబ్‌ లో ఈ సినిమాను అప్‌లోడ్ చేసిన 24 గంటల్లోనే ఈ సినిమాని కోటి 80 లక్షల మంది వీక్షించారు. రొటీన్ రొట్ట సినిమా అని అప్పట్లో మన క్రిటిక్స్ పెదవి విరిచిన సినిమా ఇలా యూట్యూబ్ లో సంచలనాను సృస్టించడం అంటే దానికి ఏమనాలో కూడా అర్ధం కాదని పరిస్థితి. ఓ డబ్బింగ్ సినిమాకు ఈ రేంజ్‌లో వ్యూస్ రావడం అది కూడా ఇప్పుడు ఇండియాలో 3వ త్రెందింగ్ లో ఉండడం అంటే ఇదో వింత పరిస్థితి అని చెప్పవచ్చు.  ఈ మధ్య కాలంలో తెలుగులో విడుదలవుతున్న ప్రతి సినిమా హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా హిందీలో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. అవన్నీ సూపర్ హిట్స్ అవుతున్నాయి. మరి ఆ డబ్బింగ్ వర్షన్ ఏదో థియేటర్లలో రిలీజ్ చేస్తే ఇంకాస్త డబ్బయినా వస్తుందేమో కదా నిర్మాతలకు ? 

More Related Stories