English   

నిత్య పొగరుబోతు....నిషేదిస్తామని బెదిరింపులు

nithyamenon
2019-04-30 20:01:33

ఈ మధ్య కాలంలో నటించడం తెలిసిన చాలా కొద్ది మంది హీరోయిన్ లలో నిత్యా మీనన్ ఒకరు. నటన పరంగా కాక ఎంత సేపూ ఎక్స్ పోజింగ్ మీద దృష్టి పెడుతున్న హీరోయిన్ లు ఉన్న ఈ రోజుల్లో నిత్య సౌందర్య రేంజ్ లో పేరు తెచ్చుకుంది. అయితే నిత్య మీద మొదటి నుంచీ విపరీతమైన రూమర్లు నడుస్తున్నాయి. అందుకేనేమో ఆమెకు ఆఫర్లు డల్ అయ్యాయి. ఈ క్రమంలో  ఆమెకి విపరీతమైన పొగరు అనీ ఆమె అసలు తనని ఎవరైనా డైరెక్టర్ , ప్రొడ్యూసర్ కలవడానికి చూస్తే ఒప్పుకోదని ప్రచారం జరిగింది. అయితే ఒక సినిమా విషయంలో నిర్మాతలతో సమావేశం కావడానికి ఇటీవల నిత్యా నిరాకరించారట. ముందస్తు సమాచారం ఇవ్వకుండా సినిమా సెట్‌కు వచ్చిన వారితో ఆమె మాట్లాడలేదట అందుకే మాలీవుడ్‌లో ఆమె మీద పొగరుబోతు అనే ప్రచారం జరుగుతోంది. ఆమెను మాలీవుడ్‌ నుంచి నిషేధిస్తామని కొందరు నిర్మాతలు పేర్కొన్నట్లు ఓ ఆంగ్లపత్రిక కధనాన్ని ప్రచురించింది. తాజాగా ఈ ప్రచారం గురించి నిత్యా తాజా ఇంటర్వ్యూలో స్పందించారు. నిర్మాతలు తనను కలవడానికి వచ్చినప్పుడు ఎవరితోనూ మాట్లాడే స్థితిలోలేనని, నిజానికి తన తల్లి క్యాన్సర్‌తో బాధపడుతున్నారని అది మూడో దశలో ఉందని, షూటింగ్‌ సమయంలో ఆమె గుర్తుకు వచ్చినప్పుడల్లా వ్యాన్‌లోకి వెళ్లి ఏడుస్తుంటానని అంత మాత్రానికే తన మీద పొగరుబోతు అనే ముద్ర వేశారని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌ 'ఐరన్‌ లేడీ'లో నటిస్తున్నారు. అంతేకాక రాజమౌళి తీస్తున్న 'ఆర్‌.ఆర్‌.ఆర్‌' సినిమాలోనూ ఆమె నతించనుంది.

 

More Related Stories