English   

నాగార్జున మాయలో పడ్డ క్యారెక్టర్ ఆర్టిస్ట్

nag
2019-04-30 20:35:19

తల్లి పాత్రలకు ఒకప్పుడు పెట్టింది పేరు అంటే సుధను చెప్పేవారు, క్రమంగా ఆ స్థానాన్ని పవిత్ర లోకేష్ ఆక్రమించిందనే చెప్పాలి. అప్పట్లో కన్నడలో హీరోయిన్ గా కుర్రకారు మనసులు కొల్లగొట్టేసిన పవిత్ర ప్రస్తుతం కన్నడతో పాటు తెలుగులో చిత్రాల్లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉంది. ఆమె తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కింగ్ నాగార్జున మీద చేసిన ఆసక్తికర కామెంట్స్ చర్చనీయాంశం అయ్యాయి. తాను 7వ తరగతి చదువుతున్నప్పుడు 'గీతాంజలి' సినిమాను చూశానని, ఆ సినిమాలో నాగార్జునగారిని చూసిన తరువాత నా జీవితంలోను ఇలాంటి మనిషి వుంటే బాగుంటుంది గదా అనిపించిందని అలా ఒకరకంగా ఆయన మాయలో పడిపోయానని ఆ తరువాత సినిమాల్లో ప్రకాశ్ రాజ్ ను చూసినప్పుడు కూడా అలాగే అనిపించింది. నాగార్జునగారితో కలిసి నటించడం కుదర్లేదు కానీ.. ప్రకాశ్ రాజ్ గారితో కలిసి చాలా సినిమాల్లో నటించానని చెప్పుకొచ్చింది. నిజానికి నాగార్జునగారితో ఇంతవరకూ మాట్లాడలేదని  ఆయన కనిపించినా మాట్లాడే ధైర్యం చేయలేదని తన టీనేజ్ విషయాలు గుర్తు చేసుకుంది ఈ సీనియర్ నటి. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆమె ఏడవ తరగతిలో చుసిన హీరో ఇంకా హీరోగానే ఉంది రెండు మూడు సినిమాలు వరుసగా చేసుకుతూ పోతున్నాడు, అప్పటి పాప మాత్రం ఇప్పుడు తల్లి పాత్రలకు పరిమితం అయ్యింది.

More Related Stories