English   

రోజా భలే షాక్ ఇచ్చిందిగా

roja
2019-04-30 20:55:49

తెలుగు టెలివిజన్ రంగంలో కామెడీకి పెద్ద పీట వేసిన ప్రోగ్రామ్ జబర్థస్త్. ముందు నుండీ ఈ కార్యక్రమానికి నాగబాబు, రోజాలు జడ్జ్ లుగా వ్యవహరించేవారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ నుంచి రోజా, జనసేన నుంచి నాగబాబు పోటీ చేయడంతో వీరిరువురు ప్రచారంలో బిజీగా ఉండటం చేత జబర్ధస్త్ కామెడీ షో దూరంగా ఉండాల్సి వచ్చింది. దాంతో వీరి స్థానంలో నటి మీనా, జానీ, శేఖర్ మాస్టర్లు ఆయా స్థానాలను పంచుకున్నారు. అయితే ఈ మద్య నాగబాబు తాను జబర్ధస్త్ ని ఎట్టి పరిస్థితుల్లో వదిలనని ఎన్నికల రిజల్ట్ వచ్చి తాను ఎంపీగా ఎన్నికయినా సరే తన ప్రోగ్రామ్ డేట్స్ చుసుకోగలనని పేర్కొన్నారు. అయితే ఈ విషయం మీద రోజా స్పందించక పోవడంతో ఆమె షో నుండి వెళ్ళిపోతుందని అనుకున్నారు. ఆమె మంత్రి అవనుందని ఆమె ఇకరాదని అన్నారు, కానీ అలా అన్నవారి అందరి నోళ్ళూ మోపిస్తూ ఆమె జబర్దస్త్ కి తిరిగొచ్చేసింది. ఈ వారం ప్రసారం కానున్న ఎపిసోడ్ ప్రోమోలో ఆమె మెరిసింది. అయితే ఈ ప్రోమోలో శేకర్ మాస్టర్ మిస్సవగా ఆయన ప్లేస్ లో రోజా వచ్చింది, ఇక త్వరలోనే నాగబాబు కూడా జాయిన్ కావడం ఖాయమని అప్పటివరకూ రోజా, మీనా న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తారన్నారని అంటున్నారు.

 

More Related Stories