English   

మహర్షి టైం చెప్పేశారు

maharshi
2019-04-30 21:33:59

సూపర్ స్టార్ మహేష్ - వంశీ పైడిపల్లి కాంబినేషన్ మూవీ `మహర్షి` మే9న అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుక రేపు జరగనుంది. ఇదే వేదికపై ట్రైలర్ ని ఆవిష్కరించేందుకు ప్లాన్ చేశారని తెలుస్తోంది. నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం భారీగా ఏర్పాట్లు సాగుతున్నాయి.  అయితే తాజా సమాచారం ప్రకారం మహర్షి ట్రైలర్‌ను రేపు ఈవెంట్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది సినిమా యూనిట్.పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అశ్వినీదత్, పీవీపీ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుండి ఇప్పటివరకూ రిలీజైన అన్ని పాటలు సోసో అనేట్టుగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మహర్షి ఈవెంట్ సినిమాకి మంచి ఊపు తీసుకొస్తుందని భావిస్తున్నారు.  

 

More Related Stories