English   

సీక్రెట్ గా ఆపరేషన్ చేయించుకున్న నటి

patel
2019-05-01 07:14:45

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కొమరం పులి సినిమాతో తెరంగ్రేటం చేసిన గుజరాతీ భామ నికిషా పటేల్ ఆ సినిమా పెద్దగా ఆడకపోవడంతో కోలీవుడ్ కి చెక్కేసింది. అక్కడ ఐదారు చిత్రాల్లో నటించి, ప్రేక్షకులను ఆలరించింది. ప్రస్తుతం జీవీ ప్రకాష్‌ సరసన, ఎళిల్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమాలో నటిస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్‌కి కాస్తా గ్యాప్ ఇచ్చి ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఆపరేషన్ చేయించుకుందని ప్రచారం జోరుగా సాగింది. ఈ ఆపరేషన్ ముంబైలో జరగిందని చెబుతున్నారు. ఈ విషయం గురించి మీడియా రకరకాలుగా ప్రచారం చేస్తుండడంతో అఆమే తాజాగా ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చింది. తన సోషల్ మీడియా అకౌంట్ లో తనకు ఆపరేషన్ జరిగిన మాట నిజమేనని పేర్కొన్న నికిషా తనకు చిన్న సర్జరీ జరిగిందని, ప్రస్తుతం అంత బాగానే ఉందని పేర్కొంది. అలాగే ప్రకాష్ తో చేసిన ఏళిల్ల్ సినిమాలో తన షూటింగ్ పార్ట్ పూర్తయిందని కొత్త ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తున్నా అని చెప్పుకొచ్చింది ఈ భామ. అలాగే ఈ సినిమాతో పాటు ఆమె నటించిన ఒక తెలుగు సినిమా కూడా రిలీజ్ కు సిద్దమయ్యింది. నికిషా టైటిల్‌ రోల్‌లో జానీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న రౌడీ పోలీస్‌ సినిమాలో ఆమె ఒక పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌గా కనిపిస్తుందట.

More Related Stories