English   

కోకాపేటలో ఆర్ఆర్ఆర్ 

 RRR
2019-05-01 10:24:29

టాలీవుడ్ లో క్రేజి ప్రాజెక్ట్ గా ఆర్ఆర్ఆర్ తెరకెక్కుతోంది. బాహుబలి సిరీస్ తర్వాత జక్కన్న డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాలో చరణ్, ఎన్టీఆర్ లు నటిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఈ సినిమా షూటింగ్‌కి బ్రేక్ ప‌డిన సంగ‌తి తెలిసిందే. చిత్రంలో ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్న రామ్ చ‌ర‌ణ్ గుజరాత్‌లోని వడోదరాలో షూటింగ్ జరుపుకుంటున్న స‌మ‌యంలో గాయ‌ప‌డ్డాడు. అయన కోలుకున్నాడు అనుకుంటుండగా ఎన్టీఆర్ గాయపడ్డాడు. దీంతో చిత్ర షూటింగ్‌ ని 3 వారాల పాటు వాయిదా వేశారు. అయితే ప్ర‌స్తుతం ఇద్దరూ కొలుకున్నారట ఈ క్రమంలో హైద‌రాబాద్ శివారు ప్రాంతంలోని కోకాపేట‌లో ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌పై కొన్ని కీల‌క స‌న్నివేశాలు తెర‌కెక్కించ‌నున్నార‌ని తాజా సమాచారం. ఈ సినిమా కోసం ప్ర‌త్యేకంగా వేసిన సెట్‌లో ఇద్దరి కాంబినేషన్ షాట్స్ తీయనున్నారు. ఈ షెడ్యూల్ పూర్తయ్యాక మ‌రోసారి పూణేకి వెళ్ళ‌నుంది సినిమా యూనిట్. కొంచెం ఆలస్యం అయినా అనుకున్న సమయానికే చిత్రీక‌ర‌ణ‌ని పూర్తి చేసి చెప్పిన డేట్ జూలై 30,2020న చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు రాజ‌మౌళి కష్టపడుతున్నట్టు చెబుతున్నారు.  

More Related Stories