English   

క్రేజీ హీరో...క్రేజీ టాస్క్ 

Simbu
2019-05-01 11:08:03

ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు ఫ్లాప్ కావడంతో ఇబ్బందుల్లో పడిన శింబు కెరియర్ గ్రాఫ్ కొంత కాలంలో కుదురుకుంది. ఆయన ఈ ఏడాది మణిరత్నం దర్శకత్వంలో చెక్కా చివంత వానం సినిమాతో హిట్ కొట్టాడు, అయితే అత్తారింటికి దారేది సినిమా మాత్రం మళ్ళీ నిరాశ పరిచింది. అయితే ఆయన ఆయన తాజా మూవీగా మానడు తెరకెక్కనుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో శింబు పాత్ర చాలా విభిన్నంగా వుంటుందట. అందువలన ఆయన లుక్ కూడా డిఫరెంట్ గా ఉందాలాట. దీంతో ఈ సినిమా షూటింగు మొదలయ్యే సమయానికి 13 కేజీల వరకూ బరువు తగ్గవలసి ఉంటుందని వెంకట్ ప్రభు చెప్పడంతో, అప్పటి నుంచి కసరత్తు మొదలెట్టిన శింబు 37 రోజుల్లో 13 కేజీల బరువు తగ్గి సక్సెస్ అయ్యాడు. ఈ మధ్య కాస్త లావు అయ్యి అదోరకంగా కనిపిస్తున్న శింబు ఇప్పుడు చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. ఇక ఈ మానడు సినిమాలో శింబు సరసన కల్యాణి ప్రియదర్శన్ కథానాయికగా నటించనుంది. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ ఈ మధ్యన జరిగిన శింబు సోదరుడి రిసెప్షన్ లో శింబు ఈ హ్యాండ్ సమ్ లుక్ తో మెరిశాడు. 

More Related Stories