English   

విరాటపర్వంలో సీనియర్ బాలీవుడ్ నటి 

Zarina Wahab
2019-05-01 11:47:07

రానా ద‌గ్గుబాటి, సాయి ప‌ల్ల‌వి ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్క‌నున్న పీరియాడిక్ మూవీ విరాట‌ప‌ర్వం 1992. ఎమర్జెన్సీ నేపథ్యంలో నక్సలైట్ లకు పోలీసులకు మధ్య జరిగే పోరాటమే ఈ సినిమా అని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా మీద చాలా ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా కోసం సీనియర్‌ హీరోయిన్ టబు, హీరోయిన్ ప్రియ‌మ‌ణిలు కీల‌క పాత్ర‌ల‌లో సంద‌డి చేయ‌నున్నారని ప్రచారం జరుగుతోంది. అందుతున్న తాజా సమాచరం ప్రకారం వైజాగ్‌కి చెందిన అల‌నాటి బాలీవుడ్ నటి జ‌రీనా వాహ‌బ్ కూడా ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించనుందట. బాలీవుడ్ లో సెటిల్ అయిన ఈమె గ‌తంలో గాజుల కిష్ట‌య్య‌, అమ‌ర ప్రేమ‌ లాంటి తెలుగు సినిమాల్లో న‌టించింది. 2010లో వచ్చిన ఆర్జీవి ర‌క్త చ‌రిత్ర సినిమాలో కూడా న‌టించింది జ‌రీనా. ఆ తర్వాత కనిపించని ఆమె తాజాగా విరాట ప‌ర్వంలో కీల‌క పాత్ర పోషిస్తుంద‌ట‌. జూన్‌లో సెట్స్ పైకి వెళ్ళ‌నున్న ఈ సినిమా మీద అంచనాలు బలంగా ఏర్పడుతున్నాయి. నీదీ నాదే ఓకే కధ సినిమాతో మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్నారు దర్శకుడు వేణు ఉడుగుల, ఈ సినిమా ఎలా తెరకేక్కించనున్నారో చూడాలి మరి. 

More Related Stories