English   

కాంచనకు రజనీకాంత్ ఆశీర్వాదం 

 Raghava Lawrence
2019-05-01 15:21:26

రాఘవ లారెన్స్‌ దర్సకత్వం వహించి నటించిన కాంచన 3 హారర్ కామెడీ నేపధ్యంలో వచ్చి కలెక్షన్ల వర్షం కురిపిస్తూ కలెక్షన్ల పరంగా సరి కొత్త రికార్డులను సృష్టిస్తోంది. కేవలం 10 రోజుల్లోనే తెలుగు,తమిళంలో కలిపి రూ.130 కోట్లు వసూలు చేయడం కాస్త ఆశ్చర్యకరంగా ఉన్నా ప్రస్తుతం సినిమాలు ఏవీ లేకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర విజయవిహారం చేస్తోంది. హాలీవుడ్‌ సంచలనం అవెంజర్స్‌ - ఎండ్‌గేమ్‌ ఇండియన్‌ బాక్సాఫీస్‌ ని షేక్ చేస్తున్నప్పటికీ దానికి ధీటుగా ఈ సినిమా కూడా బాగానే వసూలు చేస్తోంది. తాజగా ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌ విజయం అందుకున్న నేపధ్యంలో రాఘవ లారెన్స్‌ .సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఆశీర్వాదం తీసుకున్నారట. ప్రస్తుతం ముంబయిలో ‘దర్బార్‌’ చిత్రీకరణతో బిజీగా ఉన్న తలైవాను బుధవారం రాఘవ, కాంచనలో ఒక హీరోయిన్ అయిన వేదికలు కలిశారు. ఆయనతో కలిసి ఫొటోలు దిగారు ఈ ఫొటోలను ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన లారెన్స్ ‘‘కాంచన 3’ విజయం సాధించిన తర్వాత నా గురువు తలైవాను కలిశాం. ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నాం’ అని పేర్కొన్నారు. మరో పక్క కాంచన సినిమాని అక్షయ్‌కుమార్‌ ప్రధాన పాత్రలో ‘లక్ష్మీ బాంబ్‌’ టైటిల్‌ తో బాలీవుడ్ లో తెరకెక్కిస్తున్నారు. ఈమహ్యనే షూట్ కూడా ప్రారంభమైంది. ఈ సినిమాలో హీరోయిన్ గా కైరా అద్వానీ, హిజ్రా పాత్రలో అమితాబ్‌ బచ్చన్‌ నటించనున్నట్లు తెలుస్తోంది.

More Related Stories