English   

మహేష్ మహర్షి ఈవెంట్ కి గెస్ట్ లు వీరే 

 Maharshi
2019-05-01 17:49:53

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా అల్ల‌రి న‌రేష్ ప్ర‌ధాన పాత్ర‌లో వంశీ పైడిప‌ల్లి తెర‌కెక్కించిన సినిమా మ‌హ‌ర్షి ఈ నెల 9న విడుద‌ల కానున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ రోజు సాయంత్రం నెక్లెస్ రోడ్‌లోని పీపుల్ ప్లాజాలో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక జ‌ర‌గ‌నుంది. ఈ వేడుక‌లోనే సినిమా ట్రైల‌ర్ కూడా రిలీజ్ చేయ‌నున్నారు. అయితే ఈ వేడుక‌కి గెస్ట్‌గా ఎవ‌రు వ‌స్తారు అనే దాని మీద జోరుగా చ‌ర్చ‌లు జ‌రుగుతుండ‌గా, కొద్ది సేప‌టి క్రితం చిత్ర యూనిట్ పోస్ట‌ర్ ద్వారా ఆ విషయం మీద క్లారిటీ ఇచ్చేసింది. మ‌హ‌ర్షి ఈవెంట్ కి విక్టరీ వెంక‌టేష్ ముఖ్య అతిధిగా రానున్నారని ప్ర‌క‌టించింది. వెంక‌టేష్‌తో పాటు విజయ్ దేవరకొండ కూడా కూడా ఈ వేడుక‌లో సంద‌డి చేయ‌నున్నారు.  మహేష్‌ బాబు నటించిన గత సినిమా దర్శకులుగా కూడా ఈ వేడుకకు హాజరుకానున్నట్లు సమాచారం. ఈ సినిమాను దిల్ రాజు, అశ్వనిదత్‌, పీవీపీలు సంయుక్తంగా నిర్మించారు.  

More Related Stories