English   

ఆర్ఆర్ఆర్ టీం నుండి టైటిల్స్ పోస్టర్

rrr poster
2019-05-01 20:00:45

దర్శకధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న భారీ మ‌ల్టీ స్టార‌ర్ ఆర్ఆర్ఆర్. ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ సినిమా మీద రోజుకొక వార్త వస్తూనే ఉంది. ఈ విషయంలో పుకార్లు రాకుండా జక్కన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి మరీ క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ప్రధాన పాత్ర‌ల‌లో న‌టిస్తుండ‌గా చరణ్ సరసన అలియా భ‌ట్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. అయితే చ‌ర‌ణ్, ఎన్టీఆర్ లు షూటింగ్‌ లో గాయ‌ప‌డ‌డం వ‌ల‌న సినిమా షూటింగ్‌కి కొద్ది రోజులు బ్రేక్ ప‌డింది. ఇంకొద్ది రోజుల్లో సినిమాకి సంబంధించిన ఒక షెడ్యూల్‌ హైద‌రాబాద్‌లోని కోకాపేట‌లో జ‌ర‌ప‌నున్నారు. అయితే ఈ సినిమాకి అన్ని భాష‌ల‌లో ఆర్ఆర్ఆర్ అనే టైటిల్ ఫిక్స్ చేయ‌గా, ఎక్స్‌ప్యాన్ష‌న్ మాత్రం బాషభాషకూ మారనుంది. సినిమా స్టోరీకి త‌గ్గ‌ట్టు ఆర్ఆర్ఆర్ సినిమాకి స‌రైన అబ్రివేష‌న్స్ పంపమ‌ని ప్రెస్‌మీట్‌లో రాజమౌళి ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి నెటిజన్స్ నుండి మంచి రెస్పాన్స్ వ‌చ్చి అన్ని భాష‌ల‌లో ఆర్ఆర్ఆర్‌కి సంబంధించి ప‌లు అబ్రివేష‌న్స్ రాసి ట్విట్టర్ లో పోస్ట్ చేస్తున్నారు. అందులో ఆస‌క్తిక‌ర‌ టైటిల్స్‌ని పోస్ట‌ర్ రూపంలో ప్రకటించారు. మ‌రిన్నిఆస‌క్తిక‌ర టైటిల్స్ పంపండ‌ని కోరింది యూనిట్.

More Related Stories