English   

అజయ్ గట్టిగానే ఇచ్చాడుగా

ajay
2019-05-01 20:48:11

ఆరెక్క్స్ 100 సినిమాతో దర్శకుడు అజయ్ భూపతి క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ సినిమా సాధించిన విజయం అందరూ ఆయన వైపు చూసేలా చేసింది. ఆయనతో సినిమా చేయాలని యువ హీరోలు ఉవ్విళ్ళూరారు. అయితే ఆయన తదుపరి సినిమాగా మహా సముద్రం రూపొందనుందనీ ఇది యాక్షన్ తో కూడిన లవ్ స్టోరీ అని టాక్ వచ్చింది. తొలుత ఈ సినిమాలో రామ్ ని హీరోగా అనుకున్నారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ఎక్కడ తేడా కొట్టిందో బెల్లంబాబుతో సినిమా అన్నారు, అది కూడా తేడా కొట్టి ఈ సినిమాలో చైతూ కథానాయకుడిగా నటించనున్నాడనీ, కథానాయికగా సమంతను ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్తలు వచ్చాయి. విశాఖ నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుందని ప్రచారం జరిగింది. మరి ఇలా ప్రచారం జరుగుతుంటే తన ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది అనుకున్నాడో ఏమో గానీ తాజాగా ఈ విషయంపై దర్శకుడు అజయ్ భూపతి ట్విట్టర్ ద్వారా స్పందించాడు. 'ఎప్పుడు ఎవరితో ఎలాంటి సినిమా చేయాలో నాకు తెలుసు. దయచేసి పుకార్లకు చెక్ పెట్టండి' అంటూ ఘాటు ట్వీట్ చేశాడు. అయితే ఇది ఎవరికో గట్టిగానే ఇద్దామని చేసినట్టు అనిపిస్తోంది.

More Related Stories