English   

సూర్య కల నేరవేరిందట

suriya
2019-05-01 21:29:25

తమిళ స్టార్ హీరో సూర్య తెలుగు ప్రేక్షకులకు చేరువై తెలుగులో కూడా మంచి క్రేజ్ సంపాదించారు. ఆయన హీరోగా తమిళంలో నిర్మితమయ్యే ప్రతి సినిమాను తెలుగులోకి అనువాదం చేసి విడుదల చేస్తు్న్నారు. తాజాగా ఆయన హీరోగా నటించిన చిత్రం ఎన్జీకే.  ‘7/జి బృందావన కాలనీ’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ ఫేమ్ శ్రీరాఘవ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈనెల 31న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ఆడియో అలాగే ట్రైలర్ రిలీజ్ కార్యక్రమాన్ని చెన్నైలో నిర్వహించారు. ఈ వేడుకలో సూర్య మాట్లాడుతూ చాలా మంది ఈ సినిమా పొలిటికల్ డ్రామా, థ్రిల్లర్ అంటున్నారని కానీ ఈ సినిమాకి పూర్తి భిన్నమైన కోణం ఉందని చెప్పుకొచ్చాడు. ఎప్పుడూ ఎవరినీ అడగనిది తొలిసారి 2002లో ‘నాతో సినిమా చేస్తారా?’ అని శ్రీరాఘవని అడిగానని చెప్పుకొచ్చారు. ఇన్నేళ్ల తర్వాత ఆయనతో కలిసి పనిచేసే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందని తన కల నెరవేరిందని చెప్పుకొచ్చాడు. 

More Related Stories