English   

అధికారులను ప్రశ్నిస్తూ వర్మ ట్వీట్

rgv
2019-05-01 21:59:39

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ కి ఈరోజు కూడా ఏపీలో చుక్కెదురు అయిన సంగతి తెలిసిందే, ఇప్పటికే తెలంగాణ, ఓవర్సీస్‌లో విడులైన ఈ సినిమా ఏపీలో మాత్రం రిలీజ్‌ కు నోచుకోవడంలేదు. ఇప్పటికే మే 1న ఏపీలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించి మొత్తం పోస్టర్లు కూడా అతికించారు. కానీ బయోపిక్స్ మీద దేశ వ్యాప్తంగా నిషేధం ఉండడంతో ఆ సినిమా ఈరోజు కూడా రిలీజ్ కాలేదు. ఈ విషయం మీద చేస్తూ ట్విట్టర్ ద్వారా స్పందించారు వర్మ. శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయనే సాకుతో అధికారులు ఆంధ్రప్రదేశ్‌లో అన్ని థియేటర్ల నుంచి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను తీసి పడేశారు. సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చిన తరవాత, హైకోర్టు అనుమతి ఇచ్చాక కూడా శాంతి భద్రతల సమస్య ఎక్కడ ఉందని ఈ చర్యల వెనుకున్న శక్తులను ప్రశ్నిస్తున్నానని వర్మ ట్వీట్ చేశారు. నిజానికి వర్మ చెబుతున్న సెన్సార్ అన్ని బయోపిక్కులకీ జరిగింది. ఈ సినిమా అసలు తెలంగాణాలో కూడా రిలీజ్ కాకుండా ఉండాల్సింది, అయితే ముందే రిలీజ్ చేయడం వలన ఆ నిషేధం బారిన పడలేదు.

More Related Stories