English   

ధరమ్ తేజ్ పెద్దమనసు 

sai
2019-05-02 07:24:17

ఈమధ్య మన టాలీవుడ్ వారికీ సేవా గుణం అలవడుతోంది, తాము సంతోషంగా ఉన్నప్పుడు అనాధలతో సమయం గడుపుతూ వారిని సంతోషపెడుతున్నారు. ఇప్పటికే నమ్రత పలు మార్లు అనాధలకు సినిమాలు చూపి వారిని సంతోషంలో ముంచెత్తగా, తాజాగా ఆమె బాటలో ధరం తేజ్ నడుస్తున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా రికార్డ్ స్థాయి కలెక్షన్స్ తో సునామీ సృష్టిస్తున్న హాలీవుడ్ చిత్రం అవెంజర్స్. ఇలాంటి అద్భుతమైన చిత్ర రాజాన్ని అనాధ పిల్లల కోసం ప్రత్యేక షో వేసి ఔన్నత్యాన్ని చాటుకున్నాడు ధరమ్ తేజ్. అవెంజర్స్ సిరీస్ లో ఎండ్ గేమ్ చివరిది కావడంతో ఈ సినిమాకు భారీ క్రేజ్ నెలకొంది. అవెంజర్స్ సిరీస్ కున్న క్రేజ్ దృష్టిలో ఉంచుకొని అనాధ పిల్లలతో కలిసి సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, గిరీష్, నవీన్ లు హైదరాబాద్ లోని సినిమాక్స్ పివిఆర్ స్క్రీన్ లో వీక్షించారు. అక్షర కుతీర్ ఆశ్రమం, గుడ్ షెపర్డ్ ఆశ్రమం, సుధీర్ ఫౌండేషన్, స్ఫూర్తి ఫౌండేషన్, డిజైర్ సొసైటీ, నవజీవన్ ఫౌండేషన్ కు చెందిన పిల్లలు ఈ స్పెషల్ షో చూసి ఎంజాయ్ చేశారు. ఈ సందర్భంగా హీరో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ ఈ సినిమాకు నాకు ఎటువంటి సంబంధం లేదు కానీ నా సినిమాలు అర్థం చేసుకునే వయసు వీరిది కాదు. అందుకే అవెంజర్స్ లాంటి సూపర్ హీరోస్ సినిమా ఐతే బాగా ఎంజాయ్ చేయగలరనే ఈ స్పెషల్ షో ప్లాన్ చేశామని వాళ్ళందరూ నా మీద చూపిస్తున్న ప్రేమను మాటల్లో చెప్పలేనని ఆయన అన్నారు.

More Related Stories