English   

మహర్షి ట్రైలర్ టాక్ 

maharshi
2019-05-02 07:39:58

భరత్ అనే నేను బ్లాక్ బస్టర్ హిట్ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మహేష్ కెరియర్ 25 మూవీగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాని వంశీ పైడిపల్లి రూపొందించారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ ఈ చిత్రంలో కీలకపాత్ర పోషించారు. ఈ సినిమాని అశ్వనీదత్, దిల్ రాజు, పీవీపీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వెంకటేష్ చేతుల మీదుగా ‘మహర్షి’ ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘ఏలేద్దాం అనుకుంటున్నా సార్!! ప్రపంచాన్ని ఏలేద్దాం.. అనుకుంటున్నా సార్.., ఓడిపోతాం అనే భయంతో ఆటలోకి దిగితే.. ఎప్పటికీ గెలవలేం’ అంటూ మహేష్ బాబు చెబుతన్న డైలాగ్స్ సినిమా మీద మరిన్ని అంచనాలను పెంచుతోంది. స్టూడెంట్‌గా, బిజినెస్ మ్యాన్‌గా, రైతుగా మూడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో మహేష్ నటిస్తున్నాడని అర్ధమవుతోంది. ఇక ఈ సినిమాలో కీలక పాత్రలను ట్రైలర్ ద్వారా పరిచయం చేశారు. ప్రకాష్ రాజ్, జయసుధ, జగపతి బాబు తదితరుల పాత్రలతో ట్రైలర్ కట్ చేశారు. 

More Related Stories