English   

మహర్షి విజయ్ ని టెన్షన్ పెడుతోందట

Maharshi
2019-05-02 10:34:47

సూపర్ స్టార్ మహేష్ బాబు 25 మూవీ ‘మహర్షి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ హైదరాబాద్‌ లోని ఘనంగా జరిగింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు విక్టరీ వెంకటేష్, విజయ్ దేవరకొండ, అల్లరి నరేష్ తదితర టాలీవుడ్ స్టార్లు హాజరుకాగా ఆకట్టుకునేలా మాట్లాడాడు విజయ్. తాను మహేష్ బాబు ఫ్యాన్‌ ని అని మహేష్ బాబుని సార్ అని పిలవడం ఇబ్బందిగా ఉంటుందని ఎప్పటి నుండో మహేష్ బాబు.. మహేష్ బాబు అంటూ ఉన్నా. సడెన్‌గా స్టార్ అయ్యాక సార్ అని పిలవడం ఇబ్బందిగా ఉందని అన్నాడు. మహేష్ సినిమా చూడడానికి టిక్కెట్లకు చాలా కష్టపడ్డానని అమ్మాయిల క్యూ తొక్కువగా ఉండేది కాబట్టి మహేష్ సినిమా ఉందంటే ఎవరో ఒకరు అమ్మాయిని వెతుకునేవాళ్లమని చెప్పుకొచ్చాడు. నేను మీలాగే ‘మహర్షి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను చూసి ఎంజాయ్ చేద్దాం అని వచ్చానని కాని ఈ మూవీ మే 9 నాడు విడుదల చేస్తున్నారు. ఆరోజు తన పుట్టినరోజు అని అయితే నాకు బర్త్ నాడు విడుదల కావడంతో ఒక అభిమానిగా ఇప్పుడు నాకు ఒత్తిడి అనిపిస్తుందని చెప్పుకొచ్చాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నానని మే 9 ఒక సూపర్ హిట్ సినిమా చూడాలని మీలాగే వెయిట్ చేస్తున్నా అని చెప్పుకొచ్చాడు విజయ్. 

More Related Stories