English   

పూరి పేరు చెప్పడం మర్చిపోయాడా...లేక ?

Mahesh
2019-05-02 12:46:54

మహేశ్ 25వ చిత్రం 'మహర్షి' ప్రీ రిలీజ్ వేడుక, హైదరాబాద్ లో అత్యంత వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో మాట్లాడిన ప్రిన్స్, తనకు సక్సెస్‌ ఇచ్చిన ఒక్కో దర్శకుడికి పేరును చెబుతూ వారికి కృతజ్ఞతలు చెప్పాడు. తన మొదటి సినిమా 'రాజకుమారుడు' దర్శకుడు రాఘవేంద్రరావు నుంచి చివరి సినిమా దర్శకుడు కొరటాల శివ వరకూ అందరి పేర్లనూ చెప్పిన ఆయన, పూరీ జగన్నాథ్ పేరును మాత్రం చెప్పలేదు. అందరూ ఇళ్ళకు వెళ్ళాక సోషల్ మీడియాలో సారీ చెప్పాడు అనుకోండి. అయినా పోకిరి వంటి బ్లాక్ బస్టర్ ట్రెండ్ సెట్టర్ హిట్ ను అందించిన దర్శకుడి పేరు నిజంగానే మహేశ్ కు గుర్తులేదా లేకా కావాలనే అలా మర్చిపోయినట్టు నటించాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మహేశ్ నటించిన 'పోకిరి' సినిమా ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన పూరీ, ఆపై 'బిజినెస్ మేన్' పేరిట మరో హిట్ నూ మహేశ్ కు అందించాడు పూరి. అయినా మహేష్ పేరును చెప్పకవడం వలన అనేక చర్చలు మొదలయ్యాయి. వాస్తవానికి వీరిద్దరి కాంబినేషన్ లో 'జనగణమన' అనే సినిమా చాలా కాలం క్రితమే అనౌన్స్ అయినప్పటికీ, పట్టాలు ఎక్కలేదు. ఈ సినిమా విషయంలోనే ఇద్దరి మధ్యనా దూరం పెరిగిందని కొందరు అంటున్నారు. అయితే ఇద్దరూ ఒకరినొకరు సోషల్ మీడియాలో అభినందించుకోవడం ఈ పుకార్లను కాస్త ఆపుతుందేమో చూడాలి మరి.

More Related Stories