English   

అరవింద్ తో బన్నీకి విబేధాలు...క్లారిటీ ఇచ్చారు 

Allu Arjun
2019-05-02 13:42:08

స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌కు, ఆయన తండ్రి అల్లు అరవింద్‌కు మధ్య విభేదాలు వచ్చాయని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అల్లు అర్జున్ కొత్తగా వ్యాపార రంగంలోకి ప్రవేశించాలనుకుంటున్నాడనీ వ్యాపారాల మీద కాకుండా పూర్తి దృష్టి సినిమాలపైనే పెట్టమని అల్లు అరవింద్ చెప్పినా వినకపోవడంతో తండ్రీ కొడుకుల మధ్య మనస్పర్థలు వచ్చాయనే ప్రచారం జోరందుకుంది. ఈ కారణంగానే అల్లు అర్జున్ సొంత బ్యానర్ ను రెడీ చేసుకుంటున్నాడనే టాక్ కూడా వచ్చింది. వీటిపై బన్నీ ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ తమ గురించి వస్తున్న వార్తలు విని నవ్వుకున్నామని చెప్పుకొచ్చాడు. తన భార్యా బిడ్డలతో కలిసి అమ్మానాన్నలతోనే ఉంటున్నానని ప్రతిరోజు మా నాన్న నేను కలుసుకుని సరదాగా కబుర్లు చెప్పుకుంటామని, మా మధ్య అభిప్రాయభేదాలు తలెత్తినట్టుగా వచ్చిన పుకార్లను విని నవ్వుకున్నామని చెప్పుకొచ్చాడు.  నిజంగా తండ్రీ కొడుకుల మధ్య ఏదో గొడవ అన్నట్టు జరిగిన ప్రచారం మాత్రం మామూలుగా లేదు.

More Related Stories