English   

మళ్ళీ తండ్రి కాబోతున్న మంచు విష్ణు

 Manchu Vishnu
2019-05-02 15:16:04

మంచు వారింటికీ మరో వారసుడు రానున్నాడు. హీరో మంచు విష్ణు మరోసారి తండ్రి కానున్నాడు.  ఆయన సతీమణి విరోనికా త్వరలో మరో బిడ్డకు జన్మనివ్వనుంది.  ఈ విషయాన్ని కొద్దిసేపటి క్రితమే విష్ణు అధికారికంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.  త్వరలోనే తమ కుటుంబంలోకి మరొక ఏంజెల్ రాబోతోందని పేర్కొన్నారు విష్ణు.  విరోనికా, విష్ణు దంపతులకు ఇప్పటికే కుమార్తెలు అరియానా, వివియానా, మూడో సంతానంగా కుమారుడు అవ్రం ఉన్నారు. తొలుత అరియానా, వివియానా కవలలు కాగా ఆ తరువాత అవ్రం అవ్రామ్ అనే బాబు జన్మించాడు. అయితే  ఇకపోతే ప్రస్తుతం విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' పనుల్లో బిజీగా ఉన్నారు. ఆచారి అమెరికా యాత్ర సినిమా తర్వాత ఆయన మరే సినిమా ఒప్పుకోలేదు. దాదాపుగా ఆయన సినిమాలు మానేసినట్టే భావిస్తున్న తరుణంలో ఆయన తన తండ్రి విద్యా సంస్థలతో పటు సొంతగా విద్యాసంస్థలు ఏర్పాటు చేసి మరీ వ్యాపారంలోకి దిగాడు.

More Related Stories