English   

అల్లు అరవింద్ పెద్ద మనసు

Geetha Arts
2019-05-02 16:54:43

తెలంగాణాలో మరీ ముఖ్యంగా హైదరాబాద్‌లో ఎండలు మండిపోతున్నాయి. రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండ‌డంతో జ‌నాలు బ‌య‌ట‌కి వ‌చ్చేందుకు భ‌య‌ప‌డిపోతున్నారు. బయటకే రావడానికి భయపడుతుంటే ఇక ఎండ‌ల‌లో విధులు నిర్వ‌హిస్తున్న వారి ప‌రిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్‌ఎంసీ వర్కర్లు మండే ఎండ‌ల‌లోనే విధులు నిర్వ‌హిస్తుండ‌డంతో వారి బాధ‌ని అర్ధం చేసుకున్న ప్ర‌ముఖ నిర్మాత అల్లు అరవింద్ తన నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ద్వారా వారికి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. సిటీ మొత్తం ఉన్న ట్రాఫిక్‌ పోలీసులకు, జీహెచ్ఎంసీ వర్కర్లకు మజ్జిగ సీసాలను సరఫరా చేయిస్తున్నారు. వాటికి సంబంధించిన ఫోటోల‌ని త‌మ ట్విట్ట‌ర్‌లో షేర్ చేసింది గీతా ఆర్ట్స్ సంస్థ‌. ‘ఈ వేసవిలో వడదెబ్బ వంటివి తగలకుండా రోడ్లపై విధులను నిర్వర్తిస్తున్న ట్రాఫిక్‌ పోలీసులకు, జీహెచ్‌ఎంసీ వర్కర్లకు మజ్జిగ సీసాలు అందిస్తున్నాం. మజ్జిగ దాహం తీర్చడమే కాక ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. హైదరాబాద్‌ నగరం మొత్తం ఈ పంపకాలు చేపడుతున్నాం’ అని పేర్కొంది. పోలీసులకు మజ్జిగ బాటిళ్లు అందిస్తున్న ఫొటోలను పోస్ట్‌చేసింది.  

More Related Stories