English   

నువ్వొస్తానంటే మేమొద్దంటామా ?

 Siddharth
2019-05-02 18:00:29

హీరో సిద్దార్థ టాలీవుడ్ కెరీర్ ముగిసిపోయిందని అందరూ భావిస్తూ వచ్చారు. కెరీర్ తొలినాళ్లలో వరుస విజయాలను అందుకున్న సిద్దూ, ఆ తరువాత అన్నీ పరాజయాలను మూటగట్టుకున్నాడు. ఈ కారణంగా ఇక్కడ అవకాశాలు తగ్గడంతో, తమిళంలోనే తాపీగా సినిమాలు చేసుకుంటున్నాడు. అలాంటి సిద్ధార్థ్  తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నట్టుగా ఒక ట్వీట్ చేశాడు.  "ఎవడేమన్నా నేను తిరిగి వస్తానులే. నా ప్రామిస్ ను గుర్తుపెట్టుకోండి,మంచి కంటెంట్ ను సిద్ధం చేశాను నాకు 18 నెలల సమయం ఇవ్వండి మిమ్మల్ని అలరించడానికి హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నిస్తాను. నేను ఆన్ ది వే .. మాట్లాడుకుందాం" అంటూ ట్వీట్ చేశాడు. ఆ మ‌ధ్య `గృహం` అనే సినిమాతో సిద్దూ లైన్ లోకి వ‌చ్చిన‌ట్లేన‌ని భావించినా అది హార‌ర్ సినిమా కావ‌డంతో అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయింది. ప్ర‌స్తుతం త‌మిళ్ లోనే రెండె సినిమాలు చేస్తున్నాడు. మనోడి మాటలను బట్టి తెలుగులో గట్టి సినిమాతోనే రానున్నాడని అర్ధమవుతోంది.

More Related Stories